Allu Arjun: స్టార్ హీరో బన్నీ ప్లానింగ్ మామూలుగా లేదుగా.. తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లతో కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు. పుష్ప2 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతుండగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో బన్నీ సంపాదిస్తున్నారని తెలుస్తోంది. అమీర్ పేట్ లో ఏఏఏ మల్టీప్లెక్స్ ను కొన్నిరోజుల క్రితం ప్రారంభించిన బన్నీ ఈ మల్టీప్లెక్స్ ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే బన్నీ త్వరలో ఏపీలో కూడా ఏఏఏ మల్టీప్లెక్స్ దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అవుతున్న వార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఏపీలో ఏఏఏ మల్టీప్లెక్స్ ను ఎక్కడ నిర్మిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. త్వరలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బన్నీ ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. బన్నీ రాబోయే రోజుల్లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది.

బన్నీ (Allu Arjun) కెరీర్ ప్లానింగ్ సైతం అదుర్స్ అనేలా ఉంది. బన్నీ సినిమాలకు నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. పుష్ప2 సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో తెరకెక్కుతుండగా ఆ టార్గెట్ ను ఈ సినిమా సులువుగానే అందుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus