Allu Arjun New Look: బాలీవుడ్ హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా అల్లు అర్జున్ మాస్ లుక్..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాల్ట్ అండ్ పెప్పర్‌ లుక్‌ లోకి అల్లు అర్జున్ మారిపోయాడు.చెవి పోగులు,సైడ్ హెయిర్ కట్, కొంచెం నెరిసిన జుట్టు, నెరసిన గడ్డం, నోట్లో సిగార్ పెట్టుకుని అల్లు అర్జున్ చూపించిన మేనరిజం, ఆటిట్యూడ్… మాస్ క బాప్ అనిపిస్తూనే మరో పక్క యమ స్టైలిష్ గా కూడా ఉందని చెప్పాలి. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అల్లు అర్జున్ ఈ పిక్ లో కనిపిస్తున్నాడు.

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ హీరోలను తలదన్నేలానే కనిపిస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్లో అల్లు అర్జున్ హవా మొదలైంది. ‘పుష్ప ది రైజ్’ చిత్రం అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడ రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది ఆ చిత్రం.ఇటీవల దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఓ బాలీవుడ్ సినిమాలో.. ఆమె అల్లు అర్జున్ ఫ్యాన్ గా కనిపించింది అంటే,అలాగే ఆ బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బన్నీ రిఫరెన్స్ ను వాడుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.

ఇక అల్లు అర్జున్ లేటెస్ట్ పిక్ చూస్తే బాలీవుడ్ హీరోల గుండెల్లో దడ పుట్టడం గ్యారంటీ అనే చెప్పాలి. అయితే ఇది ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసమా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆ సినిమాకు సంబంధించినది కాదు.. ఓ యాడ్ కు సంబంధించిన లుక్.ఇలాంటి లుక్ లో బన్నీ ఓ సినిమాలో నటిస్తే అతని అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోవడం ఖాయమనే చెప్పాలి.ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus