అల్లు అర్జున్ (Allu Arjun) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) వరకు రీజనల్ హీరోనే. కానీ కేరళ వంటి రాష్ట్రాల్లో కొద్దిపాటి ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమా రీజనల్ మూవీగానే రిలీజ్ అయినప్పటికీ.. పాన్ ఇండియా సినిమాల మాదిరి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) కోవిడ్ టైంలో రిలీజ్ అయినప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ‘పుష్ప’ చాలా బాగా ఆడింది.
అక్కడ పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ దాని హవా అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా పాట్నా వంటి ఏరియాల్లో అతి భారీ కలెక్షన్స్ ను రాబట్టి.. నార్త్ బయ్యర్స్ కి భారీ లాభాలు పంచింది. అందుకే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ప్రమోషన్స్ కి సంబంధించి అక్కడ మొదటి ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అందువల్ల హైప్ ఇంకా పెరిగింది. బిజినెస్ ఇంకా బాగా జరిగింది.
వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి తెలుగు సినిమాగా కాదు కాదు ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది. ఏకంగా ఈ సినిమా రూ.600 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో పాటు అల్లు అర్జున్ గత సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :
పుష్ప ది రూల్ (పుష్ప 2) : రూ.600 కోట్లు
పుష్ప ది రైజ్ (పార్ట్ 1) : రూ.145.5 కోట్లు
అల వైకుంఠపురములో : రూ.85 కోట్లు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya, Naa Illu India) : రూ.82 కోట్లు
డీజె(దువ్వాడ జగన్నాథం) (Duvvada Jagannadham) : రూ.79 కోట్లు
సరైనోడు (Sarrainodu) : రూ.53.4 కోట్లు
సన్ ఆఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) : రూ.52 కోట్లు