Allu Arjun: బన్నీ ఉదారతను మెచ్చుకుంటున్న నెటిజన్లు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్1 షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఐకాన్ మూవీలో నటించనున్నారు. తాజాగా గోకవరం సమీపంలో ఉన్న రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ లో బన్నీ టిఫిన్ చేసి సింప్లిసిటీని చాటుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. వర్షం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడటంతో బన్నీ మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు.

బన్నీ టిఫిన్ చేసిన తరువాత టిఫిన్ సెంటర్ యజమానికి బిల్లు అయిన మొత్తం కంటే ఎక్కువమొత్తం ఇచ్చారు. అయితే బన్నీ టిఫిన్ సెంటర్ యజమానికి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చారని సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజన్లు బన్నీని మెచ్చుకుంటున్నారు. రియల్ లైఫ్ లో కూడా బన్నీ హీరోనేనని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా నుంచి రిలీజైన దాక్కో దాక్కో మేక సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

త్వరలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. బన్నీకి జోడీగా రష్మిక విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప రిలీజైన తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. బన్నీ గత సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా పుష్ప పార్ట్1 రిలీజ్ కానుందని సమాచారం.

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus