డైరెక్టర్ సుకుమార్ సినిమాలకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ తోనే సినిమాలోని క్యారెక్టర్స్, అలాగే హీరో బాడీ లాంగ్వేజ్, విలనిజం, సాంగ్స్ ఇలా అన్నీ అల్లుకుని ఉంటాయి. అంతేకాదు, సినిమా స్క్రీన్ ప్లేకి మరో ఇన్నర్ స్క్రీన్ ప్లే ఇవ్వడంలో ఈ లెక్కల మాస్టారి ఫార్ములానే డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో, అంతే క్రిటికల్ గా సినిమాని ఎండ్ చేస్తాడు మనోడు. ప్రస్తుతం ఆర్య కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పుష్ప సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్.
పుష్ప అనే ఎందుకు పెట్టారు అంటే ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పరాజ్ ని కుదించి పుష్పగా పెట్టారు అని, ఇది ఆర్య సెంటిమెంట్ అని అంటున్నారు అందరూ. ఆర్య కూడా రెండు అక్షరాలే అని పుష్ప కూడా రెండు అక్షరాలే అని టాక్. టైటిల్ సంగతి పక్కనబెడితే. ప్రస్తుతం షూటింగ్ అడవిలో జరుగుతోంది. ఇందులో బన్నీ ఆడే ఆట.. చేసే వేట ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సీన్స్, అడవిలో జరిగే ఛేజింగ్ సీన్స్ , నైట్ ఎఫెక్ట్ సీన్స్ పిచ్చిలేపేలా ఉంటాయని చెప్తోంది మూవీ టీమ్.
అడవిలో బన్నీ విలన్స్ తో ఆడుకునే ఆట.., బన్నీ కోసం పోలీసులు చేసే వేట చాలా ఆసక్తకరంగా ఉంటాయట.చివర్లో వచ్చే రెండు ట్విస్ట్ లు మైండ్ బ్లోయింగ్ ఉంటాయని సినిమా కథ-స్క్రీన్ ప్లే పరంగా ఒక రేంజ్ లో ఉంటుందని అందుకే ఐదుభాషల్లో సినిమా ఎనౌన్స్ చేశారని కాన్ఫిడెంట్ గా చెప్తోంది మూవీ టీమ్. ఏది ఏమైనా బన్నీ ఎంచుకునే కథలు, డైరెక్టర్స్, స్టైల్ మేకింగ్ అన్నీ కూడా బాగా కలిసొస్తున్నాయని చెప్తున్నారు సినీ మేథావులు. అదీ మేటర్.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!