RRR Glimpse: ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్‌పై అల్లు అర్జున్ రియాక్షన్!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ  ‘ఆర్.ఆర్.ఆర్’ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. మొన్నటివరకు సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్‌ ను విడుదల చేస్తూ మళ్లీ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్‌తోనే దర్శకుడు రాజమౌళి మరోసారి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశాడు. ఈ సినిమా కోసం కేవలం ప్రేక్షకులే కాకుండా సినిమా తారలు కూడా చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్‌ పై పాజిటివ్ గా స్పందించాడు. మైండ్ బ్లోయింగ్ అంటూ.. ఇండియన్ సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంతగానో గర్వకారణం అని అన్నాడు.

ఇక రామ్ చరణ్ ను బ్రదర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను బావ అని బన్నీ సంబోధించాడు. ఇద్దరిది కూడా పవర్ ప్యాక్ షో అంటూ అజయ్ దేవగన్ కు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పాడు. అలాగే గ్లామరస్ హీరోయిన్ అలియా భట్ కు అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు నటీనటులందరికి కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా విషెస్ అందించాడు. అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus