Allu Arjun: దసరా ఎంతో అద్భుతంగా ఉంది..అసలైన ఎంటర్టైనర్!

నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 31 తేదీ విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి కలెక్షన్లను కూడా రాబట్టి నాని సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులలోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చెర్రీ నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలందరూ కూడా దసరా సినిమాపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే తాజాగా దసరా సినిమా చూసినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. దసరా చిత్ర బృందానికి నా అభినందనలు చాలా అద్భుతంగా సినిమా తీశారు.

నా సోదరుడు నాని అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చారు. కీర్తి సురేష్ నటనకు ఫిదా అయ్యాను. చిత్ర బృందం మొత్తం ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ సోర్స్, కెమెరా పనితనం అన్ని చాలా సూపర్ గా ఉన్నాయని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల అరంగ్రేటం అదిరిపోయింది. నిర్మాతలకు చిత్ర బృందం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు వేసవిలో అసలు సిసలైన ఎంటర్టైనర్ దసరా అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుంది. (Allu Arjun) అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus