ఆశ్చర్యంలో అల్లు అర్జున్!!!
- April 11, 2017 / 06:33 AM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ షాక్ అయ్యాడు…ఇప్పటివరకూ తాను కూడా ఊహించని ఒక కధని ఒక ప్రముఖ దర్శకుడు మరో మెగా హీరోకి చెప్పడంతో…ఒక్కసారిగా అవాక్కు అయ్యాడు…ఇంతకీ ఎవరా హీరో ఏమిటి ఆ కధ అంటే…ఒక సారి మీరు ఈ కధ చదవాల్సిందే…విషయం ఏమిటంటే…మెగా ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే…ఆ హీరో అందం, అభినయంతో పనిలేదు…నెత్తిన పెట్టేసుకుంటారు మెగా ఫ్యాన్స్…అందులో ఏమాత్రం సందేహం లేదు…ఇదిలా ఉంటే మెగా హీరోల్లో మంచి స్పీడు మీద ఉన్నది ఎవరు అని అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే హీరో…అల్లుఅర్జున్ అయితే…తనకన్నా ఇంకాస్త దూకుడు చూపిస్తున్న నవతరం మెగాహీరో సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ స్పీడు అల్లుఅర్జున్ కంటే కాస్త ఎక్కువుగా ఉందని అంటున్నారు. సినిమా ప్లాపులు, సక్సెస్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను సాయిధరమ్ తేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో సాయిధరమ్ తేజ్ పాల్గొనటం మెగాహీరోలకే షాక్ ని ఇస్తుంది. ఇంత వేగంగా చిత్రాలను ఎలా విడుదల చేసుకుంటున్నాడు? అనేది మెగాహీరోలకి అంతుపట్టని విషయంలా మారింది.
ఇదిలా ఉంటే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోకి….వినాయక్ వద్ద నుండి ఓ కథ వెళ్ళిందట. అసలు వినాయక్ ఎలా ఆలోచించాడో ఏమో తెలీదు కానీ…ఇప్పటి వరకూ వినాయక్ ఇంతటి పవర్ఫుల్ కథని బన్నీకి కూడ చెప్పలేదు అని తెలుస్తుంది… అంతేకాదు…మెగా హీరోలు ఇద్దరు ఉన్నారు…మరో పక్క పవర్ స్టార్ ఉండనే ఉన్నాడు…అవన్నీ పక్కన పెట్టి….సాయి ధరమ్ తేజ్ కోసం వినాయక్ ప్రత్యేకమైన కథని సిద్ధం చేయటం అటు టాలీవుడ్ కే కాదు….స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి షాకింగ్ లా మారిందట. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే…మరోవైపు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ ని మాయ చేసే పనిలో ఉండటం చూసి…మెగా ఫ్యామిలీ మురిసిపోతుందట…అది మొత్తంగా సాయి ధర్మ తేజ కధ…మరి ఇదే స్పీడ్ కొనసాగిస్తే…మిగిలిన హీరోలు ఏమయిపోతారో…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















