Allu Arjun: అల్లు అర్జున్ పై కరోనా ఎఫెక్ట్!

దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. రోజుకి లక్షల సంఖ్యలో కేసులు, ఎన్నో మరణాల సంఖ్యలు బయటపడుతున్నాయి. ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటివి ప్రకటించారు. ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ తీవ్రతను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక సినీ పరిశ్రమలో ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం వైరస్ తో నిండిపోయింది.

చాలా మంది నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు కరోనా బారిన పడ్డారు. డాక్టర్ల సలహాతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వైరస్ నుండి రక్షణ కోసం జాగ్రత్తలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా మందికి ఈ వైరస్ టచ్ చేసింది. ఇప్పుడు బన్నీకి కూడా వైరస్ సోకడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ షూటింగ్ కోసం గ్యాప్ లేకుండా పని చేస్తున్నాడు బన్నీ.

హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక సిబ్బందితో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బన్నీకి కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే కొన్ని రోజులుగా బన్నీ షూటింగ్ కి కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతం కమెడియన్ సునీల్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే తనకు కరోనా వచ్చిన విషయాన్ని బన్నీ స్వయంగా వెల్లడించబోతున్నాడు. ప్రస్తుతం ఈ స్టైలిష్ స్టార్ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారని తెలుస్తోంది.


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus