Allu Arjun: ‘స్పిరిట్’ సంగతి తేల్చకుండా అర్జున్ తో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ మూవీ..!

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2′(పుష్ప ది రూల్) లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫహాద్ ఫాజిల్ ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నాడు. ‘పుష్ప’ కి సూపర్ ఎండింగ్ ఇచ్చి సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగేలా చేసింది ఈ పాత్రే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక ‘పుష్ప2’ ని 2024 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘జవాన్’ లో ఆఫర్ వద్దనుకున్నారు బన్నీ. ఇదిలా ఉంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు. టి.సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ మరియు ప్రణయ్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందు ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు సందీప్. కానీ అది సెట్స్ పైకి వెళ్ళింది లేదు. ప్రభాస్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు కూడా టి.సిరీస్ వారే నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. ‘అందువల్లే సందీప్ రెడ్డి వంగా.. అల్లు అర్జున్ వద్దకు వెళ్లిపోయాడా..? ఇక ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే మూవీ ఉండదా?’ అనే అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం సందీప్ ‘యానిమల్’ అనే బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది రిలీజ్ అయ్యాక .. ఆ అనుమానాలకు ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి. అయితే అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేసిన ప్రాజెక్టు కి .. ఒక నెంబర్ అంటూ లేదు. ఇది అల్లు అర్జున్ కు ఎన్నో సినిమా అవుతుందో చూడాలి..!

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus