“దువ్వాడ జగన్నాథం” తర్వాత అల్లు అర్జున్ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే చిత్రాన్ని చేస్తున్నారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా లో బన్నీ సోల్జర్ గా నటిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది. దీని తర్వాత కూడా అల్లు అర్జున్ మరో డైరక్టర్ ని పరిశ్రమకి పరిచయం చేయబోతున్నారు. అను కె రెడ్డి అనే యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో.. అనుభవం లేకపోయినప్పటికీ అతని దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పైగా ఈ సినిమాని తనే సొంతంగా నిర్మించనున్నట్టు తెలిసింది. తన తండ్రి అల్లు అరవింద్ కి రెండు బ్యానర్లున్నాయి.
అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురుచూసే బడా నిర్మాతలు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నిర్మాణంలో దిగడానికి రెండు బలమైన కారణాలున్నాయి. మొదటిది కథ అయితే.. రెండోది రామ్ చరణ్. తనకంటే వెనుక సినిమాల్లోకి వచ్చిన చెర్రీ అటు హీరోగానే కాకుండా నిర్మాతగానూ విజయం సాధించారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతనిలాగే తాను కూడా నిర్మాతగా నిరూపించుకోవాలని అల్లు అర్జున్ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్టు ఫిలింనగర్ వాసులు చెప్పారు. మరీ చెర్రీ లాగే.. బన్నీ నిర్మాతగా విజయం సాధిస్తారా?