బర్త్ డే పార్టీలో సందడి చేసిన ఉపాసన, స్నేహా రెడ్డి, లక్ష్మీ ప్రణతి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాంచరణ్- అల్లు అర్జున్ ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు. వీళ్ళ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే నందమూరి హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్.. రాంచరణ్ తో, అల్లు అర్జున్ తో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. రాంచరణ్ – ఎన్టీఆర్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో కలిసి నటించారు.

ఆ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కు ఆస్కార్ కు తెచ్చిన ఘనత ‘ఆర్.ఆర్.ఆర్’ కు చెందింది. ఇక ఎన్టీఆర్ – అల్లు అర్జున్ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ‘బావ బావ’ అంటూ పిలుచుకుంటూ వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాలా సార్లు చాటిచెప్పారు. వీరి ఫ్యామిలీస్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉందని తాజాగా ప్రూవ్ అయ్యింది. విషయం ఏంటంటే..

రాంచరణ్ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, (AlluArjun) అల్లు అర్జున్ సతీమణి స్నేహా.. ఓ బర్త్ డే ఫంక్షన్ లో సందడి చేశారు. ప్రముఖ బిజినెస్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ అత్యంత సన్నిహితుడు. కొన్నాళ్ళు ‘మా’ టీవీలో కూడా భాగస్వామిగా వ్యవహరించాడు.ఏప్రిల్ 27 ఇతని కూతురు స్వాతి నిమ్మగడ్డ పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రాంచరణ్ సతీమణి ఉపాసన, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్ సతీమణి సందడి చేశారు. అలాగే చిరంజీవి కూతురు శ్రీజ కూడా హాజరైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus