టాలీవుడ్ లో హీరోలను ఎంతగా ప్యాంపరింగ్ చేస్తారో అందరికీ తెలిసిందే. వాళ్లకు నచ్చినట్లుగానే షూటింగ్ లు జరిపిస్తుంటారు. స్టార్ హీరోలను కష్టపెట్టే సాహసం ఎవరూ చేయరు. అయితే హీరోలు మాత్రం తాము ఎక్కువగా అభిమానించే, గౌరవించే దర్శకుల దగ్గర మాత్రం రాజీ పడతారు. అవసరానికి మించి కష్టపడతారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలానే కష్టపడుతున్నాడని సమాచారం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘ఆర్య’ సినిమా బన్నీకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. అందుకే బన్నీకి సుక్కు అంటే ప్రత్యేక అభిమానం.
ఈ అభిమానంతోనే ‘పుష్ప’ సినిమా విషయంలో సుక్కు తనను ఎంతగా కష్టపెడుతున్నా బన్నీ సహనంగా ఉంటున్నాడట. కొద్దిరోజుల క్రితం ‘పుష్ప’ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లిలో మొదలైంది. రెండు వారాల పాటు గ్యాప్ లేకుండా అక్కడ షూటింగ్ నిర్వహించారు. అడవిలో షూటింగ్.. పైగా అన్నీ యాక్షన్ సీన్స్ తీశారట. ఆ సమయంలో బన్నీని చాలా కష్టపెట్టారట సుకుమార్. ప్రతీ షాట్ ని మూడు, నాలుగు యాంగిల్స్ లో తీయడం.. ఒక్క షాట్ ని కూడా ఓకే చేయకపోవడం వంటివి చూసి బన్నీని ఇంతగా కష్టపెట్టేస్తున్నారేంటి అని యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట.
కరోనా ఎఫెక్ట్ కి అక్కడ షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ కి వచ్చి కాచిగూడలో పాత కళ్యాణమండపంలో షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాలుగైదు రోజులుగా రాత్రిపూట షూటింగ్ జరుపుతున్నారు. దీనికోసం బన్నీ నాలుగురోజుల పాటు వరుసగా నైట్ ఔట్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా ఒకరోజు రాత్రి షూటింగ్ మొదలుపెట్టి ఉదయం 7గంటల వరకు షూటింగ్ జరిపించారట. ఒక పట్టాన షాట్ ఓకే చేయకపోవడంతో బన్నీ అలసిపోయి.. తన జీవితంలో ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడలేదని అన్నాడట. మరో దర్శకుడైతే బన్నీ ఇంత సహనంగా ఉండేవారు కాదని.. సుకుమార్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన పెర్ఫెక్షన్ గురించి తెలిసి ఇంత కష్టపడుతున్నాడంటూ యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!