సుకుమార్ సినిమా కోసం వేణు శ్రీరామ్ కు హ్యాండ్ ఇచ్చిన బన్నీ

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అలా వైకుంఠపురములో” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ కి ఈ సినిమా పూర్తవుతుంది. ఆ తర్వాత సుకుమార్, వేణు శ్రీరామ్ ల దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పాడు అల్లు అర్జున్. నిజానికి రెండు సినిమాలు ఒకేసారి చేయాలనుకున్నాడు. కానీ.. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ సినిమా కోసం బన్నీ తన స్టైల్ ను పూర్తిస్థాయిలో మార్చనున్నాడు. సో, సుకుమార్ సినిమా చేస్తున్న టైమ్ లో వేణు శ్రీరామ్ సినిమా చేయడం కష్టం. దాంతో.. సుకుమార్ సినిమా పూర్తయ్యాక కానీ వేణు శ్రీరామ్ సినిమా మొదలవ్వదు.

నానితో “మిడిల్ క్లాస్ అబ్బాయి” లాంటి కమర్షియల్ హిట్ తీసిన తర్వాత కూడా వేణు శ్రీరామ్ తన కెరీర్ కు మళ్ళీ ఇన్నాళ్ల బ్రేక్ రావడంతో కాస్త ఇబ్బందిపడుతున్నాడు. దిల్ రాజు కూడా ఏమీ చేయాల్ని పరిస్థితిలో సరేనన్నాడట. సో, బన్నీ ఐకాన్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలై.. అదే ఏడాది చివర్లో విడుదలవుతుందా లేక 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుందా అనేది చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus