అల్లు అర్జున్ “నా పేరు సూర్య” స్టోరీ తారక్ కథ కాదు

వక్కంతం వంశీ.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించారు. అందుకే అతన్ని డైరక్టర్ గా పరిచయం చేస్తానని ఎన్టీఆర్ చెప్పారు. అంతా ఒకే అనుకున్న సమయంలో ఎన్టీఆర్ బాబీతో జై లవ కుశ చేశారు. తర్వాత కూడా త్రివిక్రమ్ తో మూవీ ప్రారంభించారు కానీ వంశీ గురించి మాట్లాడలేదు. వంశీ మాత్రం అల్లు అర్జున్ తో నా పేరు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఎన్టీఆర్ కోసం రాసుకున్నదని, అతను ఈ కథలో మార్పులు చేయమని సూచించడంతో.. అది నచ్చక వంశీ అదే కథతో బన్నీతో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. అప్పుడు ఆ వార్తలను ఎవరూ ఖండించలేదు. కరక్ట్ అని చెప్పలేదు. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తరువాత “నా పేరు సూర్య ” ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ బయటకు వచ్చాక ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది.

ఎన్టీఆర్ సూపర్ సబ్జెక్ట్ మిస్ చేసుకున్నాడని టాలీవుడ్ వర్గాలవారు చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్తలను వక్కంతం వంశీ సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ తయారుచేసింది యాక్షన్ ఎంటర్ టైనర్ అని వెల్లడించారు. ఆ సబ్జెక్ట్ కి ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉందని చెప్పారు. అల్లు అర్జున్ కొత్త కథ కావాలని అడిగితే వంశీ మిలటరీ సబ్జెక్ట్ తీసుకున్నారని వివరించారు. ఎన్టీఆర్ కోసం తయారుచేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ అలాగే వుందని, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి ఆ కథని తెరకెక్కించడానికి వంశీ రెడీగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మరి నా పేరు సూర్య సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ వంశీ కి అవకాశం ఇచ్చే ఆస్కారం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus