Pushpa 2: పుష్ప2 మూవీ హక్కులకు ఈ రేంజ్ లో డిమాండ్ ఉందా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కర్ణాటక హక్కులకు ఏకంగా 30 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో టాలీవుడ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఆఫర్ అంటే అది రికార్డ్ అనే చెప్పాలి. పుష్ప2 మూవీ బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప1 మూవీ కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో పుష్ప2 మూవీకి ఈ రేంజ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

1000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప1 డిసెంబర్ నెలలో రిలీజ్ కాగా పుష్ప2 మూవీ కూడా అదే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పుష్ప2 మూవీలో రష్మిక, అనసూయ పాత్రలకు ప్రాధాన్యత పెరగనుందని బోగట్టా. విదేశాల్లో కూడా పుష్ప2 మూవీని షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బన్నీ ఫ్యాన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప2 సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప2 సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప2 (Pushpa 2) సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నిర్మాతల ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కూడా బన్నీకి వరుస విజయాలు దక్కాలని కెరీర్ పరంగా అల్లు అర్జున్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus