Pushpa 2 Censor Review: ఆ 4 ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అట..’అస్సలు తగ్గేదే లే’!

Advertisement

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. టీజర్, ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాటలకి కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా శ్రీలీల  (Sreeleela)  చేసిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ కి రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పాలి.

Pushpa 2 Censor Review:

యూట్యూబ్లో ఈ పాట రికార్డులు సృష్టిస్తోంది. ఇక డిసెంబర్ 5న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఓ పెద్ద సినిమాకి ప్రీమియర్స్ వేయడం అనేది.. ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. ఇక తాజాగా ‘పుష్ప 2’ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి 4,5 కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ యూనిట్. సినిమా చూసిన తర్వాత.. ‘పుష్ప 2’ ప్రత్యేకంగా అభినందించిందట సెన్సార్ టీం. సినిమాలో గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ బాగా వచ్చిందట. అక్కడ వచ్చే ఒక పాట అలాగే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట.

అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయట. ముఖ్యంగా శ్రీవల్లి- పుష్ప రాజ్..ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగుంటాయట. సాంగ్స్ పిక్చరైజేషన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయని సెన్సార్ వారు చెప్పినట్టు టాక్. మరి వీటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందేమో చూడాలి.

ప్రియుడిని పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news