Allu Ramalingaiah: ఘనంగా అల్లు రామలింగయ్య 101 వ జయంతి వేడుకలు!

ప్రముఖ దివంగత సినీ నటుడు అల్లు రామలింగయ్య 101 వ జయంతి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహించారు. ఈయన జయంతిని పురస్కరించుకొని అరవింద్ తన తండ్రి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్‌ పార్క్ లో ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.

అయితే మనవడి చేతుల మీదుగా అల్లు అరవింద్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ దంపతులతో పాటు స్నేహ రెడ్డి తల్లిదండ్రులు అలాగే అల్లు శిరీష్ అల్లు అర్జున్ పిల్లలు పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ రెడ్డి లేకపోవడం గమనార్హం. అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి ప్రస్తుతం లండన్ వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ లండన్ వెకేషన్ లో ఉన్న కారణంగా ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇకపోతే గత ఏడాది అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు సందర్భంగా అల్లు స్టూడియోని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా ఆయన జయంతి సందర్భంగా అల్లు బిజినెస్ పార్క్ లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనంతరం అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాట్లాడుతూ… తాతయ్య (Allu Ramalingaiah) గారి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.

ఆయన ఇప్పుడు మనతో పాటు లేకపోయినా తాతయ్య మంచి పనులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. తాతగారి దీవెనలు ఎప్పుడు మనతోనే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా అయాన్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ కుమారుడు ఎంత పెద్దవాడయ్యారు అంటూ బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus