మెగా హీరో…..’సర్జరీ’ చేయించుకున్నాడా??

టాలీవుడ్ లో టాప్ లెవెల్ లో దూసుకెళ్తున్న మెగా ఫ్యామిలీని ఎప్పటినుంచో కొన్ని రూమర్స్ వెంటాడుతూ వస్తున్నాయి. అవేమిటంటే మెగా ఫ్యామిలీలో ఈ జెనరేషన్ హీరోలు తమ లుక్స్ మార్చుకోవడానికి కాస్మొ సర్జరీ చేయించుకున్నారు అని. ఇవే రూమర్స్ గతంలో అల్లు అర్జున్ పైన….అటుపై రామ్‌చరణ్ పైన వచ్చిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి ఎంత వరకూ నిజమో అన్న మాట పక్కన పెడితే వాటిల్లో కాస్తో కూస్తే నిజం లేకపోలేదు అన్న అనుమానం రాకపోదు ఎందుకంటే సర్జరీకి ముందు సినిమాలో ఒకలాగా, సర్జరీ రూమర్స్ వచ్చిన తరువాత సినిమాల్లో లుక్స్ ఒకలాగా ఉండడమే దీనికి కాస్త కారణం అని చెప్పవచ్చి. అంతెందుకు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రిలో తన లుక్స్ విషయంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాడు….

ఇక ఆ తరువాత తాను మారిన తీరు చూస్తే నిజంగా అల్లు అర్జున్ సర్జరీ చేయించుకున్నాడేమొ అన్న అనుమానం రాకపోదు. అయితే అవి అన్నీ రూమర్స్ గానే మనం విన్నాం కానీ, వాటిల్లో నిజం ఏంటి అనేది మెగా ఫ్యామిలీకే తెలుసు. అదే క్రమంలో ఇప్పటి మెగా హీరోల్లో ఒకరైన ఆల్లు శిరీష్ తీయడానికైతే రెండు సినిమాల్లో నటించాడు కానీ, అతడి యాక్టింగ్ స్టిల్స్ కు కనీసం మెగా అభిమానులు కూడ పాస్ మార్కులు కూడ వేయలేదు. అయితే యాక్టింగ్ మాట పక్కన పెట్టి ఇప్పుడు లుక్స్ పై ఫోకస్ పెట్టాడు మన శిరీష్. తాజాగా అల్లుశిరీష్ నటిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాకు సంబంధించి విడుదలైన శిరీష్ లుక్ కు సంభందించి అనేక సందేహాలు వస్తున్న తరుణంలో కొందరు….శిరీష్ ముంబాయి వెళ్ళి తన లుక్ మార్చు కోవడానికి సంబంధించి అనుభవజ్ఞులు దగ్గర కొన్ని సలహాలు తీసుకుని ఈ లుక్ లోకి మారిపోయాడు అని అంటుంటే…మరి కొందరు…కాదు కాదు…శిరీష్ ముంబాయిలో కాస్మో సర్జరీ చేయించుకున్నాడు అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మొత్తానికైతే అల్లు వారి వారసుడు లుక్ మాత్రం ఉతికి ఆరేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus