అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి నైనికాతో ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్లో వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. టాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీలు శిరీష్ ఎంగేజ్మెంట్ కి వచ్చి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా.. శిరీష్ లవ్ స్టోరీ గురించి తాజాగా రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అతని లవ్ స్టోరీ, పెళ్ళి వెనుక ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ హస్తం ఉన్నట్లు కూడా రివీల్ చేశాడు.
Allu Sirish
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతుల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వారికి విషెస్ చెప్పిన శిరీష్ అనంతరం తన లవ్ స్టోరీ ఓపెన్ చేశాడు. ‘వరుణ్ తేజ్, లావణ్య..ల పెళ్లి టైంలో నైనికతో పరిచయం ఏర్పడిందని శిరీష్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. దాని వెనుక ఇంకో హీరో ఫ్యామిలీ కూడా ఉందట. అది మరెవరో కాదు నితిన్ అండ్ ఫ్యామిలీ. అవును 2023 అక్టోబర్లో వరుణ్ తేజ్- లావణ్య పెళ్ళి జరిగింది. అదే టైంలో నితిన్- షాలిని దంపతులు వారికి బెస్ట్ విషెస్ చెబుతూ ఓ పార్టీని హోస్ట్ చేశారట.
దానికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నైనికా కూడా హాజరైనట్లు తెలిపాడు. కరెక్ట్ గా అప్పుడే ఆమెతో పరిచయం ఏర్పడటం.. తర్వాత అది ప్రేమగా మారి పెళ్ళి వరకు వెళ్లడం జరిగిందట. మొత్తానికి ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళి చేసుకునే వరకు వెళ్లినట్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. సో పరోక్షంగా శిరీష్ పెళ్ళి కుదరడానికి నితిన్-షాలినితో పాటు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..లు కారణమని అర్థం చేసుకోవచ్చు.