ఒక్క క్షణం సినిమా రూమర్ పై స్పందించిన అల్లు శిరీష్!

గత ఏడాది  శ్రీరస్తు శుభమస్తు అనే కుటుంబ కథ చిత్రంతో పలకరించిన అల్లు శిరీష్.. ఈ ఏడాది ఒక్క క్షణం మూవీతో రానున్నారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిరీష్ సినిమాలోని ప్రత్యేకతలతో పాటు.. తమ సినిమాపై వస్తున్న రూమర్లపై స్పందించారు. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా కొరియన్ సినిమా స్ఫూర్తిగా తీశారనే వార్తలను కొట్టిపడేశారు. తమ సినిమాకి కొరియన్ సినిమాకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

సినిమా చూసిన తర్వాత ఆ విషయాన్నీ అందరూ ఒప్పుకుంటారని అల్లు శిరీష్ వెల్లడించారు. అయితే కొరియన్ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత అనిల్ సుంకర కొన్నారని,  ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ తో ‘2 మేమిద్దరం’ అనే సినిమా చేస్తున్నారని, అతను    “ఒక్క క్షణం” పై ఫిల్మ్ చాంబర్లో పిర్యాదు చేశారని ప్రశ్నించగా.. అందుకు డైరక్టర్ సమాధానమిచ్చారు. ఇది తమ సొంత కథ అని స్పష్టం చేశారు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న “ఒక్క క్షణం”లో సురభి, సీరత్‌ కపూర్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. కొత్త థీమ్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 28న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=9DlBe2KLngU

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus