తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న అల్లు శిరీష్ చాలా సంవత్సరాలు తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో ఈయన మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అలీ అడిగే అన్ని ప్రశ్నలకు అల్లు శిరీష్ ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు.
అల్లు శిరీష్ ను అలీ ప్రశ్నిస్తూ ఇదివరకు శిరీష్ నటించిన సినిమాల గురించి ప్రస్తావించారు. నువ్వు నటించే సినిమాల ఎంపిక విషయంలో ఎవరెవరి ప్రమేయం ఉంటుంది అని అడగగా అల్లు శిరీష్ ఆసక్తికరమైన సమాజానాలు చెప్పారు. అల్లు శిరీష్ నటించిన గౌరవం, ఏబిసిడి,ఒక్క క్షణం వంటి సినిమాలన్నీ కూడా తానే ఎంపిక చేసుకున్నానని అయితే ఈ సినిమా కథలు విన్నప్పుడు నాన్న వీటిని చేయొద్దు ఇవి ఫ్లాప్ అవుతాయి అంటూ ముందుగా తనకు హెచ్చరించారని శిరీష్ వెల్లడించారు.
ఈ విధంగా ఈ సినిమాల గురించి నాన్న తన జడ్జిమెంట్ ముందుగా ఇచ్చినప్పటికీ నేను మాత్రం తన మాట వినకుండా సినిమాలు చేసి ఫ్లాప్ అందుకున్నానని శిరీష్ తెలిపారు. ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా కథ మొదట నాన్నగారు కూడా విన్నారు. ఈ కథకు తానైతే బాగుంటానని నాన్నగారు ఈ సినిమాలో నటించమని చెప్పారు. ఇలా నాన్న జడ్జిమెంట్ ఈ సినిమా విషయంలో నిజమైంది.
ఇలా తన తండ్రి అల్లు అరవింద్ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారని ఇకపై తన సినిమాలన్నింటిని నాన్ననే ఎంపిక చేస్తారు అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.