బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘అల్లుడు శీను’. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బెల్లకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు కలిసి నిర్మించారు. 2014 వ సంవత్సరం జూలై 25న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 7ఏళ్ళు పూర్తి కావస్తోందన్న మాట. అతనికి టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పడడానికి ‘అల్లుడు శీను’ చిత్రం మంచి పునాది వేసింది అని చెప్పొచ్చు.
మరి ‘అల్లుడి శీను’ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.45 cr |
సీడెడ్ | 4.30 cr |
ఉత్తరాంధ్ర | 3.00 cr |
ఈస్ట్ | 1.42 cr |
వెస్ట్ | 1.35 cr |
గుంటూరు | 2.10 cr |
కృష్ణా | 1.36 cr |
నెల్లూరు | 0.92 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 21.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.50 cr |
ఓవర్సీస్ | 0.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 24.55 cr |
‘అల్లుడు శీను’ చిత్రానికి రూ.22.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.దర్శకుడు వి.వి.వినాయక్ కు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల ఈ సినిమాకి బిజినెస్ చాలా బాగా జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.24.55 కోట్ల షేర్ ను రాబట్టింది.థియేట్రికల్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ బట్టి ఓ సినిమా హిట్ ప్లాప్ అని అనేది డిసైడ్ చేస్తారు ట్రేడ్ పండితులు. కాబట్టి థియేట్రికల్ పరంగా చూసుకుంటే ఈ సినిమా హిట్టే..! కానీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి రూ.42 కోట్ల బడ్జెట్ పెట్టాడు. థియేట్రికల్,శాటిలైట్,డబ్బింగ్,ఆడియో.. ఇలా అన్ని రైట్స్ కలుపుకుంది రూ.36 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే నిర్మాతకి రూ.6 కోట్ల నష్టం. అతని సైడ్ నుండీ చూస్తే ఈ సినిమా యావరేజ్ మాత్రమే అని చెప్పాలి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!