Amala Paul: పోలీసులను ఆశ్రయించిన అమలా పాల్.. కారణం..?

స్టార్ హీరోయిన్‌ అమలాపాల్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో పలువురు పెద్ద హీరోల సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. విడాకుల వార్తలతో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. నిర్మాణరంగంలో కూడా అడుగుపెట్టి అడపా దడపా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె తమిళ నాడులోని విల్లుపురం పోలీసులను ఆశ్రయించి.. వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. అమలా పాల్ మాజీ ప్రియుడు పవీందర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడట. అతనితో అమలా పాల్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అమలా పాల్ ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కూడా కేసు నమోదు చేశారట. ముందుగా పవీందర్ ను వారు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగిలిన 11 మంది కోసం వారు గాలిస్తున్నట్టు తెలుస్తుంది.

2018 చివర్లో పవీందర్‌ సింగ్‌ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. ఆ టైంలో వీరి మధ్య స్నేహం, ప్రేమ ఏర్పడినట్లు తెలుస్తోంది. వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు కూడా హల్ చల్ చేశాయి. కానీ అవి యాడ్ షూటింగ్ కోసం అని చెప్పి అమలా పాల్ షాకిచ్చింది. అందులో వారిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో ఉన్నప్పటికీ జనాలను వారు నమ్మించే ప్రయత్నం చేసింది.

ఇక నిర్మాణ సంస్థ లావాదేవీల్లో గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు అమలా పాల్ కు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. డబ్బులు అడిగితే ఆమె ప్రైవేట్‌ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని పవీంధర్ సింగ్ బెదిరిస్తున్నాడట.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus