Amala Paul Onam Celebration: ఫ్యామిలీతో ఓనమ్ని సెలబ్రేట్ చేసుకున్న అమలాపాల్..వైరల్ అవుతున్న ఫోటోలు.!
- September 17, 2024 / 09:55 PM ISTByFilmy Focus
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ (Amala Paul) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో మంచి హిట్లను అందుకున్న అమలా.. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని విబేధాల వలన రెండేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుంది.
Amala Paul Onam Celebration

గతేడాది నవంబర్‌లో జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ఇలై , భర్త జగత్ దేశాయ్‌లతో దిగిన అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో పడవలో ప్రయాణిస్తూ కొడుకుని ఒడిలో కూర్చొబెట్టుకొని భర్తతో రోమాంటిక్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :














