ఈ దీపావళికి డబ్బింగ్ సినిమాలు 2 రిలీజ్ అయ్యాయి. అందులో ‘అమరన్’ (Amaran) ఒకటి. శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ,సాయి పల్లవి (Sai Pallavi) హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ.. గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), R. మహేంద్రన్ (R Mahendran) , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగులో హీరో నితిన్ (Nithin) తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి…లు రిలీజ్ చేశారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి (Amaran) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.28 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.67 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.21 cr |
కృష్ణా + గుంటూరు | 0.35 cr |
నెల్లూరు | 0.13 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 4.34 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.66 కోట్ల షేర్ ను రాబట్టాలి.