Amaran Collections: అదరగొట్టేసిన ‘అమరన్’ ఓపెనింగ్స్..!

శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  , సాయి పల్లవి  (Sai Pallavi)  జంటగా నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం నిన్న దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల అయ్యింది. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), R. మహేంద్రన్ (R Mahendran) , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో నితిన్  (Nithin)  తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి…లు ఈ చిత్రాన్ని ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేశారు.

Amaran Collections:

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.25 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.55 cr
ఈస్ట్+వెస్ట్ 0.12 cr
కృష్ణా + గుంటూరు 0.22 cr
నెల్లూరు 0.08 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 2.67 cr

‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.2.67 కోట్ల షేర్ ను రాబట్టి అదరగొట్టేసింది అని చెప్పాలి. అంటే 50 శాతం రికవరీ సాధించినట్టే..! బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus