Acharya Movie: ‘ఆచార్య’ టీంకి మరో షాక్… ఓటిటి కూడా గిట్టుబాటు అయ్యేలా లేదే..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలయికలో రూపొందిన మూవీ ‘ఆచార్య’. ఏప్రిల్ 29న విడుదలైన ఈ మూవీ ఘోరపరాజయం పాలయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. ఈ చిత్రానికి ముందు వరకు దర్శకుడు కొరటాల శివకి ఒక్క ప్లాప్ కూడా లేదు. కానీ ఈ మూవీతో ఆయన ఎపిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.భవిష్యత్తులో ఇంత ఘోరమైన సినిమాని కొరటాల తీసే ప్రసక్తే లేదని ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ ఘోరంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ‘ఆచార్య’ సినిమాకి ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ నమోదవుతాయి అని ఎవ్వరూ ఊహించలేదు. నిన్న 4 వ రోజున చిరు, చరణ్ లకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏరియాలు అయిన ఈస్ట్, గుంటూరు వంటి ఏరియాల్లో జీరో షేర్ నమోదవ్వడం ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఈరోజు రంజాన్ హాలిడే కాబట్టి ఏమైనా కలెక్షన్లు రావచ్చు కానీ.. ‘ఆచార్య’ బాక్సాఫీస్ రన్ అయితే దాదాపు క్లోజ్ అయినట్టే అని చెప్పాలి.

ఈ క్రమంలో ఓటిటి పైనే ‘ఆచార్య’ హోప్స్ పెట్టుకుంది. ఓ పెద్ద సినిమా విడుదలైన 4 వారాలు పూర్తయ్యేవరకు ఓటిటిలో విడుదల చేయకూడదు అనే అగ్రిమెంట్ ఉంటుంది. ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే రెండు వారాల్లో విడుదల చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే ఇందుకు సదరు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన సంస్థ ముందుగా అనుకున్న రేటు కంటే మేకర్స్ డిమాండ్ చేసినంత చేయాల్సి ఉంటుంది.

‘ఆచార్య’ మేకర్స్ ఆ విధంగా ప్రయత్నాలు చేసినా ఇందుకు అమెజాన్ వారు అంగీకరించలేదని తెలుస్తుంది. దీని పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. మరి అమెజాన్ వారు ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus