ఏఎంబి సినిమాస్ సెలబ్రేషన్స్ లో నమ్రత మహేష్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా ఎంతో విజయవంతం అయ్యారు. మహేష్ బాబు బిజినెస్ లో భాగంగా హైదరాబాదులో ఏఎంబి సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఏసియన్ సునీల్ నారంగ్ తో భాగస్వామ్యం అయ్యి గత ఐదు సంవత్సరాల క్రితం ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో ఎంతో సౌకర్యవంతంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ థియేటర్ ఏర్పాటు చేశారు.

ఇలా ఈ మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూడటానికి ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి అయిందని తెలుస్తోంది. దీంతో ఈ మల్టీప్లెక్స్ నిర్వాహకులు కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఏషియన్ సునీల్ నారంగ్ తో పాటు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ అలాగే నమ్రత కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలలో గౌతమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా వీరంతా కేక్ కట్ చేసి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారని చెప్పాలి. ఇక మహేష్ బాబు ఏషియన్ వారితో కలిసి కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా రెస్టారెంట్ బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ రెస్టారెంట్ వ్యవహారాలన్ని కూడా నమ్రత చూసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా (AMB Cinemas) వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus