బిగ్ బాస్ హౌస్ లో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్జున్ అంబటి పోటుగాళ్ల టీమ్ లీడర్ గా వ్యవహరిస్తూ టాస్క్ లలో దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా పోటుగాళ్లు అయిన తన టీమ్ మెంబర్స్ అందర్నీ ముందుండి నడిపిస్తున్నాడు. గౌతమ్ సీక్రెట్ రూమ్ లో నుంచీ వచ్చిన తర్వాత పోటుగాళ్ల టీమ్ మెంబర్ అయ్యాడు. గౌతమ్ , అంబటి అర్జున్ ఇద్దరూ కూడా స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో కో ఆర్టినేషన్ తో గెలిచారు. ఫాస్టెస్ట్ అనే ట్యాగ్ ని పొందారు.
ఆ తర్వాత జీనియస్ టాస్క్ లో గౌతమ్ ఒక్కడే సోలాగా ఆడి తమ టీమ్ ని గెలిపించాడు. ఇక్కడ కూడా అర్జున్ బిగ్ బాస్ కి రెండుసార్లు అబ్జక్షన్ పెట్టాడు. పాయింట్స్ గెలుచుకున్నాడు. ఇక తర్వాత స్ట్రెంత్ టాస్క్ లో రాకెట్స్ ని బ్యాలన్స్ చేస్తూ చాలాసేపు ప్రిన్స్ కి ఎదురుగా పోటీకి నిలిచాడు. ఈ పోటీలో తను స్ట్రాటజీ వాడి పోటుగాడు అనిపించుకున్నాడు. ఆటగాళ్ల తరపున ప్రిన్స్ యావర్, పోటుగాళ్ల తరపున అర్జున్ స్ట్రాంగెస్ట్ టాస్క్ లో పోటీకి తిగారు. ఇద్దరూ సమ ఉజ్జీలుగా పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్లుగా రాకెట్స్ ని బాలన్స్ చేస్తూ పోటీపడ్డారు.
ఇక్కడే అర్జున్ ఫస్ట్ ఎడమ చేతిలో ఉన్న రాకెట్ ని కావాలనే వదిలేశాడు. తన స్ట్రాంగ్ నెస్ ని కుడిచేతిలో పెట్టుకుని మరో రాకెట్ ని కాపాడుకున్నాడు. కానీ, ప్రిన్స్ రెండు రాకెస్ట్ ని చాలాసేపు బ్యాలన్స్ చేస్తూ తన స్ట్రాంగ్ నెస్ ని కోల్పోతూ వచ్చాడు. అంతేకాదు, ముందర కుడిచేతిలో ఉన్న రాకెట్ ని వదిలేయడం వల్ల ఎడమ చేతికి ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రిన్స్ యావార్ రాకెట్ ని వదిలేశాడు. బాగా పైయిన్ వచ్చింది.
కానీ, అర్జున్ మాత్రం కుడిచేతిలోని రాకెట్ ని అలాగే చాలాసేపు కాపాడుకున్నాడు. పోటుగాళ్ల టీమ్ ని గెలిపించాడు. తర్వాత బిగ్ బాస్ స్మార్టెస్ట్ అంటూ టాస్క్ పెట్టాడు. ఇందులో ఆటగాళ్ల టీమ్ స్పీడ్ గా చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతకముందు జరిగిన కలర్స్ టాస్క్ లో ఆటగాళ్లు విజయం సాధించారు. దీంతో వారికి ఫాస్టెస్ట్ అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఆటగాళ్లు – పోటుగాళ్లు ఇద్దరిలో ఏ టీమ్ గెలుస్తుంది. ఈవారం కెప్టెన్సీకి పోటీ పడి ఇంటిని కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.