Amigos: ఓటీటీలో అయినా అమిగోస్ మూవీ రిజల్ట్ మారుతుందా?

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసినా కథ, కథనం కొత్తగా లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీలో కచ్చితంగా హిట్టవుతుందని కామెంట్లు వినిపించాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా ఒకింత ఆలస్యంగా ఓటీటీలో విడుదల కావడం గమనార్హం.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా (Amigos) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ ఫలితం తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కగా కథ, కథనం కొత్తగా ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మారి ఉండేదని చెప్పవచ్చు. థియేటర్లలో ఏదైనా కారణం వల్ల ఈ సినిమాను చూడని వాళ్లు ఓటీటీలో చూడవచ్చు. కళ్యాణ్ రామ్ భిన్నమైన కథలనే ఎంచుకుంటున్నా కొన్ని పొరపాట్ల వల్ల ఈ హీరో సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించడం లేదు.

కళ్యాణ్ రామ్ పారితోషికం కూడా తక్కువగానే ఉందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

డెవిల్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు  సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నందమూరి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus