Amitabh Bachchan: అల్లు అర్జున్‌తో నన్ను పోల్చొద్దు: అమితాబ్ కామెంట్స్‌ వైరల్‌!

ప్రస్తుతం ఇండియన్‌ సినిమా అంతా అల్లు అర్జున్‌ (Allu Arjun)  కోసం మాట్లాడుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన గురించి మాట్లాడుతున్నా అది సినిమా కోసం కాదు. ఓ థియేటర్‌ ఆ సినిమా వేసినప్పుడు జరిగిన విషయం కోసం, ఆ తర్వాత ఆయన రెస్పాండ్‌ అయిన విధానం కోసం. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)  కూడా బన్నీ గురించి మాట్లాడారు. ఆయనతో నాకు పోలిక వద్దు అని కామెంట్‌ చేశారు.

Amitabh Bachchan

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్‌. ఈ క్రమంలో ఇటీవల టెలీకాస్ట్‌ అయిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్‌ గురించి అమితాబ్‌ చేసి:న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌ ఇది జరిగింది. తాజా ఎపిసోడ్‌కు కోల్‌కతాకు ఓ గృహణి కంటెస్టెంట్‌గా రాగా ఈ టాపిక్‌ చర్చకు వచ్చింది.

తనకు అల్లు అర్జున్‌, అమితాబ్‌ బచ్చన్‌ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు. దీనిపై అమితాబ్‌ స్పందిస్తూ.. ‘అల్లు అర్జున్‌కు నేను కూడా వీరాభిమానిని. ‘పుష్ప: ది రూల్‌’ మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అతడితో నన్ను పోల్చొద్దు అని బిగ్‌ బీ అనడం వైరల్‌గా మారింది. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా బాలీవుడ్‌ ప్రచారంలో భాగంగా ముంబయిలో ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బీ గురించి బన్నీ గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.

అమితాబ్‌ ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారని.. ఎంతోమంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్‌ సినిమాలు చూస్తూ పెరిగాననరి, ఆయన స్ఫూర్తితో తాను ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు బన్నీ గురించి బిగ్‌బీ ఇలా అనడం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌లో హుషారు తీసుకొచ్చింది. అయితే దానిని మనస్ఫూర్తిగా తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఫ్యాన్స్‌ లేరు. ఎందుకంటే ఇక్కడ ‘సంధ్య థియేటర్‌’ ఘటన నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దల నుండి బన్నీ కాస్త హీట్‌ ఫేస్‌ చేస్తున్నాడు.

రాంచరణ్ సినిమాకి ఆ రెండు విషయాల్లో ఇబ్బందులు తప్పేలా లేవుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus