Kalki: ట్రెండ్ బద్దలవుతున్న అమితాబ్ న్యూ లుక్..!

రెబల్ స్టార్ ప్రభాస్ , ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’. ప్రస్తుతం అంతా ‘సలార్’ మోజులో ఉండటంతో.. ఈ సినిమా గురించి వినబడటం లేదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. అందుకు కారణం ఆ మధ్య విడుదల చేసిన వీడియోనే. హాలీవుడ్ రేంజ్‌లో.. ఇంకా చెప్పాలంటే అంతకుమించిన రేంజ్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందనే హింట్‌ని కల్కి టీజర్ ఇచ్చేసింది. దీంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి.

అయితే కొన్ని రోజులుగా వార్తలలో లేని ఈ ఈ సినిమా.. తాజాగా ట్రెండ్ బద్దలు కొడుతోంది. కారణం ఏమిటో తెలుసా? బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బర్త్‌డే. బిగ్ బి ‘కల్కి’‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. చిత్రయూనిట్ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సినిమా పేరును టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

ఈ లుక్‌లో అమితాబ్‌ను చూసిన వారంతా ఆశ్యర్యపోతున్నారు. ఇందులో ఆయన గురూజీ తరహా పాత్రను పోషిస్తున్నట్లుగా.. ఓ సాధువు లుక్‌ లో కనిపిస్తున్నారు. ఫేస్ అంత క్లియర్‌గా చూపించలేదు కానీ.. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనే విషయం ఈ లుక్ తెలియజేస్తోంది. వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఆయన పాత్ర కూడా ఈ సినిమాలో (Kalki) వైవిధ్యంగా ఉండబోతుందని సమాచారం. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పశుపతి, దిశా పటానీ వంటి వారు నటిస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఓ పాత్రలో నటించినట్లుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రభాస్ కూడా తన ఇన్‌స్టాగ్రమ్ వేడుకగా.. ఈ పోస్టర్‌ను పోస్ట్ చేసి.. అమితాబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags