Amitabh Bachchan: ప్రాజెక్ట్ k టీష‌ర్టుతో అభిమానులను కలుసుకున్న అమితాబ్.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ప్రాజెక్టు కే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో జులై 20న టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఇక ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం (జులై 8) ఒక స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

ప్రాజెక్ట్ K అని రాసి ఉన్న టీష‌ర్టును ఫ్రీగా అందజేసి అభిమానులను ఖుషీ చేసింది. ఒక ప్రత్యేక లింక్ ఇచ్చి దాని ద్వారా రిజిస్టర్ అయ్యి ఈ టీ షర్ట్ పొందవచ్చని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కూడా ఈ సినిమాలో భాగమైన విషయం మనకు తెలిసిందే. దీంతో ఈయన ప్రాజెక్ట్ కే టీ షర్టు సొంతం చేసుకున్నారు. ఈ టీ షర్ట్ ధరించి (Amitabh Bachchan)  ఈయన ఆదివారం జల్సాలో తన అభిమానులను కలిశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిత్ర బృందం అనౌన్స్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే టీ షర్ట్స్ అన్ని కూడా అయిపోవడం గమనార్హం. ఇలా రెండుసార్లు ఈ టీ షర్టులను విడుదల చేశారు. మొదటి టీష‌ర్టులో ‘What is Project K’ అని రెండు చేతులు బొమ్మ ఉంటే, సెకండ్ టైం టీష‌ర్టుల్లో ‘The Rise’ అని ఉండి ఒక వ్యక్తి బొమ్మ ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus