Amitabh Bachchan: ‘కల్కి 2898 ad’ గురించి అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ కామెంట్స్!
- October 29, 2024 / 11:46 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఏఎన్నార్ (Akkineni Nageswara Rao) నేషనల్ అవార్డుని అందజేసి ఘనంగా సత్కరించింది అక్కినేని కుటుంబం. ఈ వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా చిరంజీవి ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అందుకున్నారు. చిరంజీవి- అమితాబ్ బచ్చన్- నాగార్జున (Nagarjuna) ..ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున కోసం ‘మనం’ (Manam) లో.. చిరంజీవి కోసం ‘సైరా నరసింహారెడ్డి’ లో (Sye Raa Narasimha Reddy) ముఖ్య పాత్రలు చేశారు అమితాబ్ బచ్చన్.
Amitabh Bachchan

అది కూడా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా..! బదులుగా ఇంటి ఫుడ్ ఆశించడం తప్ప ఇంకేమి అమితాబ్ కోరలేదు అని చిరంజీవి ఈ సందర్భంగా అమితాబ్ గురించి గొప్పగా వివరించారు. చిరంజీవి హిందీలో సినిమాలు చేసినప్పుడు కూడా అమితాబ్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అమితాబ్ బచ్చన్ కూడా చిరంజీవి, నాగార్జున..లతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పారు.

అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు. ఇదే సమయంలో ‘నేను చేసిన ‘కల్కి 2898 ad’ని (Kalki 2898 AD) కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఆ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్ ని రుణపడి ఉంటాను. ‘కల్కి…’ వల్ల నేను కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను’ అంటూ అమితాబ్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ad’ లో అశ్వద్ధామగా అద్భుతంగా నటించారు అమితాబ్ బచ్చన్. ఆ పాత్రకి ఆయన్ని తప్ప ఇంకెవ్వరినీ ఊచించలేం అనేనేతలా చేశారు. ఆ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.












