Vijay Devarakonda: త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- October 28, 2024 / 01:51 PM ISTByFilmy Focus
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. నిన్న అంటే అక్టోబర్ 27న ప్రీ- రిలీజ్ వేడుకని హైదరాబాద్లోని జె.ఆర్.సి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకకి ‘లక్కీ భాస్కర్’ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri).. అండ్ టీంతో పాటు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ అతిధులుగా విచ్చేశారు.ఎప్పటిలానే త్రివిక్రమ్ స్పీచ్ అదిరిపోయింది. ‘దుల్కర్ సల్మాన్.. తన తండ్రి మమ్ముట్టి గర్వపడే హీరో అని.
Vijay Devarakonda

దుల్కర్ సల్మాన్.. మర్రిచెట్టు లాంటి వారు. సాధారణంగా మర్రిచెట్టు కింద మొలిచే మొక్కలు బ్రతకవు అని అంతా అంటుంటారు. అయితే దుల్కర్ తండ్రి నీడలో కాకుండా సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు అని. అతని వర్క్ చూసి ఇంప్రెస్ అయిపోయినట్టు’ చెప్పారు. మరోపక్క విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు త్రివిక్రమ్ (Trivikram). ‘అతను హీరోగా మారిన కొంత కాలానికే బోలెడంత ప్రేమను చూశాడు. అలాగే ద్వేషాన్ని కూడా చూశాడు.

అయినా సరే విజయ్ చాలా గట్టోడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా స్పీచ్ ఇస్తూ త్రివిక్రమ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) సినిమాలు అంటే నాకు ఎంతో ఇష్టమని, ‘ఖలేజా’ సినిమా బాలేదు అని అని చెప్పినవాళ్ళతో బాగా గొడవపడేవాడిని అని, నాకు మొదటి చెక్ ఇప్పించింది త్రివిక్రమ్ గారే అంటూ’ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

అతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్వతహాగా విజయ్… మహేష్ బాబుకి (Mahesh Babu) వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అందుకే ‘ఖలేజా’ గురించి అతను యుద్ధం చేసి ఉండొచ్చు. కానీ ఆ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు అనే సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.
ఖలేజా నచ్చలేదు అంటే గొడవ పెట్టుకునే వాడ్ని..ఎందుకంటే?#VijayDevarakonda #Khaleja #Trivikram #LuckyBaskhar #DulquerSalmaan pic.twitter.com/PCdqwsnxuN
— Filmy Focus (@FilmyFocus) October 27, 2024

















