అయ్యో.. ఆ సినిమాలు అమితాబ్ చేసుంటే మరోలా ఉండేదే..!

ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు ‘ప్రభాస్ 21’ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్టు నిర్మాతలైన ‘వైజయంతి మూవీస్’ వారు ప్రకటించారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు కావడంతో వాళ్ళు ఈ క్రేజీ అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనుంది. నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటీకే దీపికా పదుకొనె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇదిలా ఉండగా.. అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలో నటించడం ఇది మొదటిసారి కాదు.

గతేడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రంలో కూడా నటించారు. అంతేకాదు ఆ చిత్రంకంటే ముందు ‘మనం’ వంటి క్లాసిక్ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేశారు.మొదటిసారి నేరుగా ఓ తెలుగు సినిమాలో అమితాబ్ కనిపించింది ‘మనం’ చిత్రంలోనే..! అయితే తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన మూడు సినిమాలను అమితాబ్ రిజెక్ట్ చేశారట. అవేంటో తెలుసా.. ఒకటి మహేష్ నటించిన ‘పోకిరి’ కాగా మరొకటి ‘బాహుబలి'(సిరీస్). పూరిజగన్నాథ్ ‘పోకిరి’ సినిమాలో ఓ పాత్ర కోసం అమితాబ్ ను సంప్రదించారట. కానీ ఆయన డేట్స్ ఖాళీ లేక చెయ్యలేను అన్నారట.

ఆ పాత్ర ఏంటన్నది మాత్రం రివీల్ కాలేదు. ఇక ‘బాహుబలి'(సిరీస్)లో కూడా ఓ ప్రాముఖ్యత కలిగిన పాత్ర కోసం రాజమౌళి.. అమితాబ్ ను సంప్రదించారట.దానికి కూడా అమితాబ్ ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆయన రిజెక్ట్ చేసిన ‘పోకిరి’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్క్లూజన్’ చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఇందులో ‘పోకిరి’ అలాగే ‘బాహుబలి2’ చిత్రాలు ఏప్రిల్ 28నే విడుదల కావడం..!

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus