Amitabh, Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్!

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు పోటీగా మరే సినిమా రిలీజ్ కావడం లేదు. ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Click Here To Watch

తాజాగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో నాగ్ అశ్విన్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. పెద్దవాళ్లను గౌరవించే విషయంలో స్టార్ హీరో ప్రభాస్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ప్రభాస్ ఒదిగి ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ మెగాస్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కు ఇంటి భోజనం పంపించారు.

అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు ప్రభాస్ ను ప్రశంసించారు. అమితాబ్ తన ట్వీట్ లో ప్రభాస్ ఔదార్యాన్ని కొలవడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇంట్లో రుచిగా వండిన ఆహారాన్ని ప్రభాస్ నాకు పంపించాడని అమితాబ్ కామెంట్లు చేశారు. ప్రభాస్ తనకు పంపించిన భోజనంతో ఆర్మీకి ఒక పూట కడుపు నింపొచ్చని అమితాబ్ కామెంట్లు చేశారు. ప్రభాస్ స్పెషల్ గా తయారు చేయించిన కుక్కీలు ఎంతో బాగున్నాయని అమితాబ్ బచ్చన్ అన్నారు.

ప్రభాస్ కాంప్లిమెంట్లకు సంతోషమని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. అమితాబ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. ఒక్కో సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus