బిగ్‌బాస్ UNSEEN: ఇంట్లో ధర్నా చేసిన లాస్య, సోహైల్‌, మోనాల్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో జరిగిన అన్నీ టీవీలో చూపించరనే విషయం మీకు తెలుసు కదా. అవి ఇంట్రెస్టింగ్‌గా ఉండవు అనుకుంటారో లేక తర్వాత చూపిద్దాం అనుకుంటారో కానీ… కొన్నైతే కనిపించవు. అలా ఒక ఆసక్తికరమైన సన్నివేశం అన్‌సీన్‌గా హాట్‌స్టార్‌లో కనిపించింది. అమ్మ రాజశేఖర్‌, లాస్య, మోనాల్‌, సోహైల్‌ బిగ్‌బాస్‌ ఎదుట ధర్నా చేస్తూ కనిపించారు. అంతకుముందు అమ్మ రాజశేఖర్‌ అయితే ఏకంగా డోర్‌ బద్దలు కొట్టాలని చూశాడు. అసలేమైందంటే? ఇంట్లో నియమాలు పాటించలేదని లాస్య, అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, మోనాల్‌కు బిగ్‌బాస్‌ శిక్ష వేశాడు.

స్టోర్‌ రూమ్‌ డోర్‌ మూసేశాడు. దీంతో వారందరూ ఆ డోర్‌ ముందు నిలబడి రిక్వెస్ట్‌ చేసుకున్నారు. మామూలుగా చేస్తే అక్కడ అమ్మ రాజశేఖర్‌ ఉండి ఉపయోగం ఏంటి… అందుకే తనదైన శైలిలో ఫన్నీగా చేసి చూపించాడు. ‘సామీ సామీ బిగ్‌ సామీ.. ’ అంటూ ఓ ఫన్నీ సాంగ్‌ కూడా పాడేశాడు. అక్కడితో ఆగకుండా డోర్‌ తీయకపోతే బద్దలు కొట్టేస్తా అంటూ సూట్‌ కేస్‌ ఏసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు కూడా. అయితే డోర్‌ కొట్టకుండా కెమెరాలో ముఖం పెట్టి భయపెట్టాడు.

తతంగం అక్కడితో ఆగలేదు. తర్వాత ఆ నలుగురూ డోర్‌ ముందు కూర్చొని ధర్నాకు దిగారు. ‘డోర్‌ ఓపెన్‌’ చేయాలి అంటూ నినాదాలు కూడా చేశారు. ‘సామి సామి బిగ్‌ సామి డోర్‌ ఓపెన్‌ చెయండి బిగ్‌ సామీ’ అంటూ నినాదాలు చేశారు. ‘సారీ చెబుతున్నాం బిగ్‌ సామీ’ అనబోయి ‘సారీ చెప్పు బిగ్‌ సామీ’ అంటూ తిరిగి బిగ్‌బాస్‌క సారీ అడిగింది మోనాల్. ఇదంతా ఎందుకు, బిగ్‌బాస్‌ ఎందుకు వాళ్లకు శిక్ష వేశాడో ఆఖరున తెలిసింది. మైక్‌లో బ్యాటరీలు మార్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల బిగ్‌బాస్‌ వాళ్లకి ఆ శిక్ష వేశాడు. సోహైల్‌, మోనాల్‌ మైక్‌లో బ్యాటరీలు అయిపోగా, అమ్మ రాజేశేఖర్‌ మాస్టర్‌ మైక్‌ ధరించడం మరచిపోయాడు. దీని వల్ల లాస్యకు శిక్ష పడింది.

Click Here To Watch The Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus