Venkatesh: వెంకటేశ్‌ నెక్స్ట్‌ మూవీపై ఇంట్రెస్టింగ్‌ బజ్‌

వినోదం, వైవిధ్యం ఉంది అంటే… ఆ సినిమా చేయడానికి వెంకటేశ్‌ ఎప్పుడూ ముందుంటారు. ఆ దర్శకుడు కొత్తవాడా కాదా? వెనుక హిట్లున్నాయా? లేవా అనేవి ఎప్పుడూ చూడరు. అలా వెంకటేశ్‌ ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కొత్తవాడంటే మరీ కొత్తవాడు కాదు కానీ… ఓ రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడే. అతనే అనుదీప్‌. ఆఁ… ‘జాతిరత్నం’ అనుదీపే. ‘జాతిరత్నం’ తర్వాత అనుదీప్‌ వేరే సినిమా మొదలుపెట్టలేదు.

చాలామంది హీరోలు, నిర్మాతల పేర్లు వినిపించినా ఏవీ ఓకే అవ్వలేదు. దీంతో తమిళ పరిశ్రమ వైపు వెళ్లారనే వార్తలూ వచ్చాయి. శివకార్తికేయన్‌కు అనుదీప్‌ ఓ కథ చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు అనుదీప్‌ తిరిగి చెన్నై నుండి హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌కి వచ్చేశారట. వెంకటేశ్‌కు ఇటీవల ఓ కథ చెప్పారని టాక్‌. వెంకటేశ్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘దృశ్యం 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

‘ఎఫ్‌ 3’ తర్వాత ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అనుదీప్‌ కథ ఓకే అయ్యి… మెటీరియలైజ్‌ అయితే అదే నెక్స్ట్‌ సినిమా అవుతుంది. అయితే ఈలోపు ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ పని పూర్తి చేసే పనిలో ఉంటారేమో వెంకటేశ్. మరి మన కుర్ర కెప్టెన్‌ సీనియర్‌ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus