24 ఏళ్ళ ‘అన్నమయ్య’ వెనుక అంత కథ నడిచిందా..!

  • May 22, 2021 / 05:09 PM IST

అక్కినేని అందగాడు మాత్రమే కాదు టాలీవుడ్ అందగాడు కూడా అయిన నాగార్జున హీరో.. ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ‘ వంటి మంచి మాస్ హిట్ ఇచ్చిన నిర్మాత వి.దొరస్వామి రాజు గారు నిర్మాత. కె.రాఘవేంద్ర రావు వంటి మాస్ డైరెక్టర్ అందులోనూ ‘జానకి రాముడు’ వంటి హిట్ కూడా ఇచ్చాడు. ఇలాంటి కాంబినేషన్లో ‘అన్నమయ్య’ వంటి భక్తిరస చిత్రం ఏమిటి.. ? నాగార్జునకు ఉన్న క్రేజ్ కు ఏ కమర్షియల్ సినిమా తీసి ఎంటర్టైన్ చేసి క్యాష్ చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చిన వారితో పాటు.. డబ్బులు బాగా ఎక్కువైపోయినట్టు ఉన్నాయి అందుకే దొరస్వామి ఇలాంటి సినిమా తీస్తున్నాడు అని కామెంట్స్ చేసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకుని 1997 మే 22 న విడుదలైంది ‘అన్నమయ్య’ చిత్రం. భక్తిరస చిత్రం కథా ఏముంటుంది లే.. అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి… వీటికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది అంటూ థియేటర్ల మొహం చూసిన వారు లేరు.ప్లాప్ అని కూడా అనేసారు. 2 వారాలు అయిపొయింది. లాభం లేదు అని ఓ సక్సెస్ టూర్ ను కూడా ఏర్పాటు చేసి సినిమాని లేపే ప్రయత్నం చేశారు. అదీ వర్కౌట్ కాలేదు.

కానీ విచిత్రంగా 17, 18 రోజుల నుండీ సినిమాకి జనం రావడం మొదలు పెట్టారు. విచిత్రంగా హౌస్ ఫుల్ బోర్డు లు కూడా పడ్డాయి. నాగార్జున నటన కీరవాణి సంగీతం … ఎంతో కలర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్ర రావు డైరెక్షన్ కలిపి సినిమాని సూపర్ హిట్ గా.. కాదు కాదు ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలబెట్టాయి. స్పెషల్ జ్యూరి కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా ధాక్కించుకున్నాడు నాగ్.

42 ఈ చిత్రం 100 రోజులు ఆడి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తరువాత చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలకృష్ణ ‘పాండు రంగడు’ వంటి భక్తి రస చిత్రాలు చేసి నాగార్జునలా సక్సెస్ సాధించాలని ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. 24 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ను లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉంటే ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus