మహేష్ కు చిరు భరోసా ఇచ్చిన వేళ?

ఇప్పుడంటే.. మహేష్ బాబు పెద్ద స్టార్.. కానీ కొంచెం గతంలోకి వెళ్లి చూసుకుంటే అతను చాలా డౌన్ ఫాల్ ను ఎక్స్ పీరియన్స్ చేసాడు. మహేష్ బాబు మంచి క్రేజ్ ను సంపాదించుకోవడానికి 7 సినిమాల వరకూ టైం పట్టింది.గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఒక్కడు’ చిత్రానికి ముందు.. మహేష్ బాబు ఖాతాలో ‘రాజకుమారుడు’ ‘మురారి’ వంటి హిట్లు మాత్రమే ఉన్నాయి. ఓ పక్క ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, రవితేజ.. వంటి హీరోలు అప్పటికే మంచి క్రేజ్ ను సంపాదించుకుని దూసుకుపోతున్నారు.కానీ కృష్ణ గారి అబ్బాయి అని చెప్పుకునే రేంజ్లో మహేష్ బాబు అప్పటికింకా స్ట్రాంగ్ హిట్ ఇవ్వలేదు.

అలాంటి టైములో ‘ఒక్కడు’ చిత్రం వచ్చింది. చెప్పాలంటే ‘ఒక్కడు’ చిత్రానికి ముందే ‘నిజం’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ‘నిజం’ చిత్రం లేట్ గా విడుదల అయ్యింది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే..2003 జనవరి 15న ‘ఒక్కడు’ చిత్రం విడుదలయ్యింది. ఆ చిత్రం రిలీజ్ రోజున మహేష్ చాలా కంగారు పడిపోయాడట. ఎవరు ఫోన్ చేసి ఏ న్యూస్ చెబుతారో అని చాలా టెన్షన్ పడ్డాడట. సాయంత్రం వరకూ అదే టెన్షన్లో ఉన్నాడట. అయితే సాయంత్రం మహేష్ కు ఓ బుకే వచ్చిందట.

దాని పై కంగ్రాట్యులేషన్స్ అని రాసి ఉంది. ఆ బుకే పంపింది మరెవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి గారు. ‘మీ నటన చాలా బాగుంది. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వుద్ది’ అని ఓ లెటర్ కూడా రాసి పంపారట మెగాస్టార్. అది చూసిన తరువాత మహేష్ ఊపిరి పీల్చుకున్నాడు. చిరు చెప్పినట్టే ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. మహేష్ కు మాస్ ఫాలోయింగ్ ను కూడా తెచ్చిపెట్టింది. తరువాత ‘నిజం’ ఆడియో వేడుకకి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మరోసారి మహేష్ బాబుని స్టేజి పైనే అభినందించారు.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus