Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తొట్టెంపూడి వేణు ఒకప్పుడు హీరోగా పలు హిట్లు ఇచ్చినవాడే. కానీ ఇప్పుడు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా క్లిక్ అవ్వలేకపోతున్నాడు.రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. కానీ అది ఎటువంటి ఇంపాక్ట్ చూపలేదు. తర్వాత ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. తర్వాత మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపాడు. అది ఆగిపోయినట్టు టాక్. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘హనుమాన్ జంక్షన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తొట్టెంపూడి వేణుకి ప్లాపులు ఎదురయ్యాయి.

Kalyana Ramudu

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన ‘వీడెక్కడి మొగుడండీ’ సినిమా యావరేజ్ గా ఆడినా… ఆ తర్వాత వచ్చిన ‘ప్రియ నేస్తమా’ ‘మళ్ళీ మళ్ళీ చూడాలి’ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలాంటి టైంలో ‘కళ్యాణ రాముడు’ అనే సినిమా చేశాడు వేణు. మలయాళంలో హిట్ అయిన ‘కళ్యాణ రామన్’ కి ఇది రీమేక్. వేణుకి ‘చిరునవ్వుతో’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన జి.రాంప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

2003 జూలై 18న రిలీజ్ చేశారు. అయితే ఆ ముందు వారం అంటే జూలై 9న రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ , జూలై 11న రిలీజ్ అయిన వెంకటేష్ ‘వసంతం’ సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్నాయి. అలాంటి టైంలో ‘కళ్యాణ రాముడు’ వంటి సినిమా రిలీజ్ అయితే జనాలు పట్టించుకుంటారా? పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అసాధ్యమే. ‘కళ్యాణ రాముడు’ కి పాజిటివ్ టాక్ వచ్చింది.

కానీ నిలబడుతుందా అనే సందేహం మేకర్స్ లో ఉండేది. లక్కీగా ఆ టైంలో గోదావరి పుష్కరాలు ఉండటంతో ‘కళ్యాణ రాముడు’ సినిమాకి కలిసొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. వేణు ఖాతాలో ఓ హిట్టు పడింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

న్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus