నిఖిల్ పుట్టిన రోజు ఇటీవల జరిగింది. ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అంటూ కొన్ని అనౌన్స్ చేసేశారు. అందులో క్రేజీ ప్రాజెక్ట్ అంటే.. ‘స్వయంభు’ అని చెప్పాలి. రామ్‌చరణ్ నిర్మాతగా ఓ సినిమా అనౌన్స్ చేశారు కదా.. అంతకంటే ‘స్వయంభు’ సినిమా ఏ విధంగా స్పెషల్ అనే డౌట్ వచ్చిందా? అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వెనుక జరిగిన విషయాలు మీకు కచ్చితంగా తెలియాల్సిందే.
నిఖిల్ మామూలుగానే వరుస సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే ‘కార్తికేయ 2’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలే సెట్ అవుతున్నాయి. ఈ మధ్యే రిలీజైన ‘స్పై’ సినిమా టీజర్ అదిరిపోవడంతో… సినిమా మీద అంచనాలు వేరే రేంజ్ అనేలా ఉన్నాయి. చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియా హౌస్’ పెద్ద రేంజి సినిమా.
దీంతో ‘స్వయంభు’ విషయంలోనూ ఇదే చర్చ జరిగిందట. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తాడు. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. తమిళనాడుకు చెందిన ఈ యువ దర్శకుడు తమిళంలో కొన్ని సినిమాలకు రచయితగా పని చేశారట. చోళుల నేపథ్యంలో వారియర్ స్టోరీ రెడీ చేసుకుని నిర్మాత ఠాగూర్ మధును సంప్రదించారట.
నిఖిల్ (Nikhil) డట్లు ‘ఠాగూర్’ మధు దగ్గర ఉండటం… ‘కార్తికేయ 2’తో మారిన ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ పెద్ద బడ్జెట్ సినిమాను నిఖిల్ చేయడానికి ముందుకొచ్చాడట. అయితే తమిళ వాసనలు పోవడానికి కొన్ని మార్పులు చేసి ఇప్పుడు సినిమా అనౌన్స్ చేశారట. చోళుల కనెక్షన్ తీసేసి ఫిక్షనల్ స్టోరీగా మార్చినట్లు సమాచారం. త్వరలో సినిమా గురించి మరింత సమాచారం అనౌన్స్ చేసే అవకాశం ఉందట. అప్పుడు సినిమా గురించి ఇంకాస్త సమాచారం తెలుసుకోవచ్చు అంటున్నారు.