డైరెక్టర్ సుకుమార్ కి ఒక లెక్కుంటుంది.. దానికి ఒక తిక్క కూడా ఉంటుంది. ఈ లెక్కల మాస్టార్ ఫార్ములా వర్కౌట్ అయితే సిల్వర్ స్క్రీన్ పైన కాసులవర్షం కురుస్తుంది. ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వకపోతే ఆన్సర్ రాంగ్ వస్తే మాత్రం ఆ కథ వేరే ఉంటుంది. ప్రస్తుతం బన్నీతో చేస్తున్న పుష్ప సినిమా విషయంలో మరి సుక్కూ ఎలాంటి లెక్కలు వేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని ఐదుభాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందు ఉన్న బన్నీ మార్కెట్ కంటే కూడా బాగా బిజినెస్ అవుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి.
అందుకే ఐదు భాషల్లో పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో లెక్కల ప్రకారం చూస్తే పుష్ప హిట్ అవ్వడం పక్కాగానే కనిపిస్తోంది. ఇందులో బన్నీ వరల్డ్ వైడ్ మార్కెట్ స్టామినా ఎంత అనేది కూడా లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగులో 100 నుంచి 150కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే, హిట్ టాక్ వస్తే మాత్రం గ్యారెంటీగా 250కోట్లకి పైగానే వసూళ్లు సాధిస్తుంది. ఇక మనోడికి మలయాళం మార్కెట్ కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హ్యాజ్ మార్కెట్ అవుతుంది. ఈసారి హిందీ మార్కెట్ పైన కూడా కాన్సన్ ట్రేషన్ చేశారు కనక ఖచ్చితంగా అక్కడ భారీ వసూళ్లని సాధిస్తుంది కూడా.
ఈ లెక్కలన్నీ కలిపితే సినిమా రిలీజ్ కి ముందే భారీ రేటు పలకడం ఖాయంగానే కనిపిస్తోంది. అన్ని భాషల్లో కలిపి రిలీజ్ కంటే ముందే 300కోట్ల నుంచి 350కోట్ల వరకూ ప్రిరిలీజ్ బిజినెస్ అవుతుందని ఒక అంచనా. అంటే , క్రికెట్ లో బాల్ పడకుండానే స్కోర్ బోర్డ్ ఓపెన్ అయినట్లు అన్నమాట. ఫస్ట్ బాల్ వైడ్ అండ్ ఫోర్ అయితే బాల్ పడకుండానే మనకి ఐదురన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు ఈ సినిమాకి కూడా ప్రిపరేషన్స్ లో ఉండగానే భారీగా ఆఫర్లు వస్తాయి అని కాన్ఫిడెంట్ గా ఉంది చిత్రయూనిట్. దీంతో ఇప్పుడు పుష్ప సినిమా దమ్మెంత ? హిట్ టాక్ వస్తే ఎన్ని వందల కోట్లు కలక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అదీ విషయం.