ఒక్కోసారి ఫ్లాప్ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పడుతుంటుంది. అయ్యో ఈ పాట హిట్ సినిమాకు పడుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంటుంది. అలాంటి ఫీలింగ్ కలిగించే పాటల్లో ‘బాచి’లోని ‘లచ్చిమి లచ్చిమి…’ పాటొకటి. సినిమాను ఫలితం అందరికీ నిరాశ కలిగించినా పాట మాత్రం ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఆ పాట పాడిన రఘు ఇప్పుడు ఎక్కడికెళ్లినా ఆ పాట పాడమని అడుగుతుంటారట. అంతగా ఆయనకు పేరు తెచ్చిన పాట వెనుక ఏం జరిగిందో తెలుసా?
సినిమాల అంటే ఆసక్తితతో రఘు హైదరాబాద్‌కు వచ్చేసిన తొలి రోజుల్లో పూరి జగన్నాథ్‌ను ఒక కేఫ్‌లో కలిశారట. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ రూమ్మేట్స్ అయ్యారు. ఆ రోజుల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ల రూంలో రఘ పాడే పాటలు విని , ‘నేను దర్శకుడైతే నీకు గాయకుడిగా ఛాన్స్ ఇప్పిస్తా’ అని మాట ఇచ్చారట పూరి. అయితే తొలి సినిమా ‘బద్రి’లో ఆ అవకాశం ఇవ్వలేకపోయారు. పెద్ద బేనర్, పెద్ద హీరోతో కావడంతో తనకు పాట ఇప్పించలేకపోయాడని రఘు చెప్పాడు.
రెండో సినిమా ‘బాచి’కి వచ్చేసరికి కొత్త సంగీత దర్శకుడు అయితే బాగుంటుందని చక్రితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట పూరి. ఆ సమయంలో రఘుతో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని చక్రిని పూరి కోరారట. అయితే ‘లచ్చిమి లచ్చిమి…’పాటను తనే పాడాలని చక్రి అనుకున్నారట. అయితే రఘు వచ్చి… ఆ పాటే పాడతానని పూరితో చెప్పారట. రఘు అడిగిడారు కదా అని ఆ పాటను అతనితో పాడించారట చక్రి. అయితే ఆ పాటను తొలుత పాడిన స్టయిల్ నచ్చక… చక్రి మార్పించారట. అదే ఇప్పుడు మనం వింటున్న పాట. ఇదన్నమాట పాట వెనుక సంగతి.