SSMB28: “అ” సెంటిమెంట్ ను త్రివిక్రమ్ ఫాలో అయ్యారా?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయిందని గతంలో పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని బోగట్టా. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే అ అనే అక్షరంతోనే సినిమా టైటిల్స్ ఉంటాయి.

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపైనా త్రివిక్రమ్ ఈ సెంటిమెంట్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. అయితే మహేష్ బాబు ఇప్పటికే అర్జున్ అనే సినిమాలో నటించారు. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కాగా ఆరోజే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం అర్జునుడు టైటిల్ కు నో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ కు సంబంధించి రూమర్లు రావడం కొత్తేం కాదు. అయితే టైటిల్ కు సంబంధించి త్రివిక్రమ్ లేదా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. వరుసగా మహేష్ సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతూ ఉండటం గమనార్హం. మహేష్ థమన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus