అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో పుష్ప షూటింగ్ సిద్ధం అయ్యారు. ఐతే ఆయన జోరుకు లాక్ డౌన్ దెబ్బేసింది కేరళలో ఓ లాంగ్ షెడ్యూల్ దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేయగా కరోనా వైరస్ వ్యాప్తితో బ్రేక్ పడింది. గత ఐదు నెలలుగా ఇంటికే పరిమితం అవుతున్న అల్లు అర్జున్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుతలో ఉన్నారు. కాగా సుకుమార్ త్వరోనే పుష్ప మూవీ షూటింగ్ తిరిగి మొదలుపెట్టనున్నారట.
దీనిలో భాగంగా మొదటగా ఆయన బన్నీ, రష్మికలపై ఓ సాంగ్ షూట్ చేయనున్నారట. ఈ మూవీ సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ఇప్పటికే సాంగ్స్ కంపోజ్ చేయగా హీరో హీరోయిన్స్ పై సాంగ్ చిత్రీకరించనున్నారట. ఇక పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేక్ ఓవర్ అయ్యారు. ఆయన ఎన్నడూ లేనివిధంగా జుట్టుతో పాటు, గడ్డం కూడా విపరీతంగా పెంచేశారు. మొదటిసారి బన్నీ ఓ డీగ్లామర్ రోల్ చేస్తుండగా రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు.
ఆయన వేష బాషలు, పాత్ర తీరు చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. కాగా పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషలలో పుష్ప మూవీ విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి.
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?