Mahesh Babu, Trivikram: ‘మహేష్ 28’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు 2 సినిమాలు వచ్చాయి. ఒకటి 2005 లో వచ్చిన ‘అతడు’ కాగా ఇంకోటి 2010 లో వచ్చిన ‘ఖలేజా’. ఇవి రెండు బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలు కాదు. ‘అతడు’ డీసెంట్ హిట్ అనిపించుకోగా… ‘ఖలేజా’ భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబుని కొత్తగా ప్రెజెంట్ చేసిన ఘనత త్రివిక్రమ్ కు దక్కింది.

‘తన కెరీర్ కు ఉపయోగపడే సినిమా ఇస్తుంటాడు’ అని త్రివిక్రమ్ గురించి మహేష్ పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న 3వ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మించబోతున్నారు. అయితే మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న 3వ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య ‘ఖలేజా’ ‘అరవింద సమేత’ తప్ప త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ దాదాపు ఒకే కథతో రూపొందినవే.

‘ఓ కుటుంబంలో సమస్య… ఆ సమస్యని తీర్చడానికి హీరో ఆ ఇంటికి వెళ్లడం.. దాని చుట్టూ అల్లుకున్న కామెడీ, భావోద్వేగాలు’.. ఇలాంటి అంశాలతో త్రివిక్రమ్ సినిమాలు రూపొందుతున్నాయి. దాంతో అలాంటి సబ్జెక్ట్ మహేష్ బాబుతో వద్దంటూ కామెంట్లు చేశారు అభిమానులు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్- త్రివిక్రమ్ ల సినిమాకి ‘నువ్వు నాకు నచ్చావ్’ టచ్ ఉంటుందట. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరో సిటీ వచ్చి తన తండ్రి స్నేహితుడి ఇంట్లో చేరడం..

ఆ తర్వాత అక్కడే హీరోయిన్, హీరోయిన్ చెల్లెలతో లవ్ ట్రాక్.. ఇలా కథ సాగుతూ ఉంటుందట. అయితే టేకింగ్ మాత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ కి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది.ఇక పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus