Ante Sundaraniki: అంటే సుందరానికి వెనుక ఇంత కథ ఉందా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన అంటే సుందరానికి సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. నిదానంగా ఈ సినిమాకు బుకింగ్స్ పుంజుకుంటున్నాయి. మేజర్ సినిమాలా ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లను తగ్గించి ఉంటే మరింత బెనిఫిట్ కలిగి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అమెరికాలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అక్కడ ఈ సినిమా షూటింగ్ జరిగింది. సాధారణంగా లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వరనే సంగతి తెలిసిందే.

అంటే సుందరానికి మూవీలో కొంతభాగాన్ని న్యూయార్క్ లో షూట్ చేయాలని ప్రయత్నాలు చేయగా అనుమతులు లభించలేదని నాని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాకు పెళ్లి కాబోతుందని కాబోయే భార్య కొరకు సర్ప్రైజ్ వీడియో చేస్తున్నామని అబద్ధం చెప్పి సినిమా షూట్ చేశామని నాని తెలిపారు. అమెరికా పోలీసులను ఒక విధంగా మోసం చేసి అంటే సుందరానికి మూవీ షూటింగ్ చేశామని నాని చెప్పకనే చెప్పేశారు.

మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండగా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. భారీ బడ్జెట్ తోనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు జయాపజయాలతో సంబంధం లేకుండా నాని క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే నాని రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం నాని దసరా సినిమాతో బిజీగా ఉన్నారు. 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉన్న నాని తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus